calender_icon.png 18 December, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సర్’తో ఒత్తిడి పెరుగుతున్నదా?

18-12-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ నినాదం గండికొట్టడం వల్ల ‘సర్’ ప్రయ త్నం నిరాటంకంగా సాగుతున్నది. ఓటరు జాబితాలోని తప్పులు సరిదిద్దాల్సిన ప్రత్యే క సమగ్ర సవరణ (సర్) బీజేపీ ‘ఘర్’గా మారి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడం ఆలోచించాల్సిన అంశం. అంతేకాదు అధికార పార్టీ జేబు సంస్థగా ఎన్నికల సంఘం మారిపోయిందన్న విమర్శలకు తోడు  ‘ఓట్ చోరీ’ యథేచ్ఛగా కోన సాగుతుందనే విమర్శ కూడా ఉంది.

విచిత్రమేమిటంటే బతికి ఉన్న వారి ఓట్లు గ ల్లంతు కావడం, బీజేపీకి చెందిన వాళ్లు వ లసలు వెళ్లినప్పటికీ వారి పేర్లు జాబితాలో ఉండడం బీహార్ ‘సర్’ స్పెషల్ డ్రైవ్ చేసిన ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి గె లుపుకు కారణమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ఎన్డీయే కూటమి సర్ ప్రక్రియ ను సమర్దిస్తే, కాంగ్రెస్, ఆర్జేడీ ఇదంతా ‘ఓట్ చోరీ’ కుట్రగా అభివర్ణించారు.

ఇది లా ఉంటే ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బీఎల్వోలు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్ని రాష్ట్రాలు సాధారణంగా రాష్ర్ట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సహాయకులను బీఎల్వోలుగా నియమించారు. అయితే విధి నిర్వహణలో కొందరు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 60 మంది బీఎల్వోలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయ డం గమనార్హం.

దీన్ని బట్టి ఎన్నికల సం ఘం బీఎల్వోలపై ‘సర్’ పేరుతో ఏ రకంగా ఒత్తిడి తెస్తుందో మనం అర్థం చేసుకోవ చ్చు. ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని ఫిబ్రవరి 7 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ‘సర్’ను నమ్ముకున్న రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో లక్షలాదిగా ఓట్లు గల్లంతు కావడం వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చిందనే ప్రచారం పెరిగి పోయింది.

రాజ్యాంగ దురాక్రమణ..

బీహార్ ఓటర్ జాబితాలో  ప్రత్యేక సమ గ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓట్లు గల్లంతైనట్లు కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా ‘సర్’ రెండో దశ ప్రక్రియలో భాగంగా బెం గాల్‌లో 58 లక్షల ఓట్లను ఎలక్షన్ కమిషన్ తొలగించింది. సర్ విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాలో చనిపోయిన వా రి లిస్టులో తన పేరు ఉందంటూ స్థానిక టీఎంసీ కౌన్సిలర్ సూర్యదేవ్ విన్నూత్నం గా నిరసన తెలిపడంతో ‘సర్’ కేంద్రానికి కొమ్ముకాస్తున్న పనితీరు బయటపడింది.

దీనిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా అలాంటిది ఏమిలేదని, నమోదైన ఓటర్ల సంఖ్యలో 6 శాతం తొలగింపులు.. బదిలీ చేయబడిన లేదా గైరాజరు ఓటర్ల కారణంగా జరిగాయని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చుకుంది. అదీగాక పౌర ధృవీకరణ పత్రాలు అడిగి రివర్స్ దాడికి దిగింది. నిజానికి కోట్లాది మంది దగ్గర పౌర ధృవీకరణ పత్రాలు లే వు. ఓటరు జాబితా దిద్దుబాటకు ఇది రాజమార్గం కాదు కదా అన్నది గ్రహించాలి.

బీహార్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ  మహిళల ఖాతాల్లోకి రూ.10వేలు బదిలీ చేసిన అంశంపై ఎన్నికల సంఘం ఎలాం టి చర్య తీసుకోలేదన్న విమర్శ అలాగే ఉండిపోయింది. ‘ఓట్ చోరీ’ ద్వారానే గెలిచిందని పదే, పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌కు ఈసీ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నది ప్రశ్నర్థకంగా మారింది. ఓటు చోరీ అంటే రాజ్యాంగ దురాక్రమణ, అందుకే 400 సీట్లు వస్తే పూర్తిగా రాజ్యాం గం అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతుందనే ఆయుధంగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

ఎన్నికల సంఘం కమిషనర్ల పై ఎలాంటి చర్యలు తీసుకునే వీల్లేకుండా మోదీ సర్కారు చేసిన చట్టం, బీజేపీ గెలుపులో ‘సర్’ ఒక చుట్టంగా మారింది. బా బా సాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన ఓటు హక్కును కోల్పోతే పేదలకు న్యా యం జరగదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులను రక్షించే పనిలో పడ్డదని ఒక కేంద్ర మంత్రి తన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

అధికారుల బెదిరింపులు..

2024 ఎన్నికల్లో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందని రెడ్ బుక్ ద్వారా కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. కానీ బీజేపీని మాత్రం 240 సీట్లకు కట్టడి చేయడంలో సఫలీకృతమైందని చెప్పొచ్చు. అలక్ష్యంతో, స్వార్థంతో, అన్యస్థితిలో, అసమర్ధతతో, అవినీతితో చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా, అనాదిగా రెండు, మూడు చోట్ల ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసేందుకు బీఎల్వోలను నియమించి వారికి జీతాలు చెల్లిస్తుంది.

పని ఒత్తిడి తట్టుకోలేక, అధికారుల బెదిరింపులకు 10 రోజుల్లో 9 మంది బీఎల్వోలు మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర స వరణ (సర్) చట్టం ద్వారా తొలిగించే ఓట్లు అన్ని కూడా మైనార్టీలు, దళితులు,ఆదివాసీలు ఎక్కువగా ఉండడం ఆందోళనకు గు రిచేస్తుంది. ఓట్ చోరీపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు నాయకుల్లో ఆత్మవిశ్వాసం కొరవడినట్టు కన్పించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సం ధించిన ప్రశ్నాలకు అర్థం ఉంది. హర్యానా ఓటర్ల జాబితాలో ఒక విదేశీ మహిళా ఫోటో 22సార్లు ఎలా నమోదు అయ్యిందని ప్రశ్నిస్తే సమాధానం దొరకలేదు. ఆ ఫోటోను బీజేపీ కార్యకర్తలు వాడుకొని విజయం సాధించారనే ప్రచారం జరిగిం ది. ఒక్కో ఇంట్లో 500 లేదా 600ల ఓట్లు నమోదు కావడాన్ని ఓటమి అంచున ఉన్న బీజేపీకి సంజీవనిగా అక్రమాలుకు ఎన్నికల సంఘం సహకరించిందనే భావం అందరిలో ఉంది.

‘ఓట్ చోరీ.. గద్దీ ఛోడ్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్ లీ లా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చే యడానికి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్.. మోహన్ భగవత్ వ్యాఖ్యలను, మ నుస్మృతి భావజాలం ఆలోచన విధానం బీజేపీ అనుసరిస్తుందనేది నిర్వివాదాంశం.  

విచారణ అవసరమే!

ప్రజాస్వామ్య దేశంలో బతికి బట్టకట్టాలంటే, ఒక జాతి ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఒక ఎన్నిక ‘ఒక్క రోజు’లో ఎన్నిక నిర్వహించినట్లయితే అక్రమాలకు తావు ఉండదేమోననిపిస్తున్నది. దేశ వ్యా ప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దశల వారీగా ఎన్నిక ని ర్వహించాలంటే బ్యాలెట్ పేపర్ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఆయుధంగా ప్రజాస్వామ్య వాదులు వర్ణిస్తున్నారు.

అదానీ, అంబానీని నమ్ముకొని 2024 సా ధారణ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడానికి తగిన బలం ఉన్నదని టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పిన మాటలు గుర్తు చేసుకోకుండా ఉండలేము.బీజేపీ ఎ ప్పుడు కార్పొరేట్ శక్తులవైపే అండగా నిలిచింది. మోదీ కోరినట్టు 400 సీట్లు కట్టబె డితే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి, పేదల పొట్ట కొట్టేవారని విపక్షాలు పలుమార్లు అనేక వేదికల్లో చెప్పడం జరిగింది.

అయితే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశం, ఇక్కడ ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారు. సార్వభౌమ, లౌకిక, ప్రజస్వామ్య, గణతంత్ర రాజ్యం ఈ దేశం వయోజనులందరికి ఓటు హక్కును కల్పించింది. అందుకే ఎవరు అధికారంలో ఉం డాలనేది నిర్ణయించేది, దేశాన్ని కాపాడ కలిగేది ఓటు మాత్రమే. ప్రతిపక్షాలు కోరినట్టు పారదర్శకంగా ఉండేందుకు ఓటు చోరీపై ప్రతి నియోజకవర్గంలో విచారణ చేపట్టాలి.

అలా అయితేనే డబుల్ ఎంట్రీ లు, ఓటు మిస్సింగ్ లాంటి అవకతవకలు గుర్తించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పుయి, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ జేబు సంస్థగా ఉండేందుకు కమిషనర్లను తొలగించకుండా చట్టం తెచ్చిందనే విమర్శ సర్వత్రా నెలకొంది. 

 వ్యాసకర్త సెల్:- 9866255355