18-12-2025 12:00:00 AM
జూకంటి జగన్నాథం :
* రాహుల్ గాంధీ పేర్కొన్న సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణన ప్రక్రియను చేపట్టాయి. అంతేగాక తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కావాలని కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని తెలంగాణ శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన విధానాన్ని ఆయా రాజకీయ పార్టీ లు ఎన్నికల ప్రయోజనం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తేనే బీసీ రిజర్వేషన్ల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుం ది. అప్పుడే బీసీ వర్గాల రిజర్వేషన్ల పడవ సురక్షితంగా తీరం చేరుతుంది.
కానీ దేశం లో అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లపై రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక అంచనాతో మాట్లాడుతున్నాయనిపిస్తున్నది. రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయాలనే యో చన ఎవరిలో కనిపించడం లేదు. దీనివల్ల వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అందని ద్రాక్షలానే మిగిలిపోయాయి. రిజర్వేషన్లు తమ హక్కుగా భావించి ఒక బలమైన సా మాజిక ఉద్యమ నిర్మాణం జరగనంత వరకు పైవర్గాల దయాదాక్షిణ్యాల మీదే బీసీ వర్గాల రిజర్వేషన్లు ఆధారపడి ఉంటా యి.
నినాదాలు వినడానికి మంచిగానే ఉంటాయి కానీ పరిష్కరించడంలోనే చిక్కు అంతా ఉంటుంది. దీనికి పై వర్గాల వారిని నిందించే బదులు రాజకీయ పార్టీల్లో ఉన్న వెనుకబడిన వర్గాల సబ్బండ కులాలు అం తర్మధనం చేసుకొని ఒక శక్తివంతమైన గొంతుగా అవతరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అవకాశం దేశ చరిత్రలో బీసీలకు రెండుసార్లు అందివచ్చింది.
మిశ్రమ ప్రభుత్వాలు..
ప్రస్తుతం 1952 నుంచి 2024 వరకు 16 సార్లు జరిగిన లోకసభ ఎన్నికల ఫలితంగా ఏర్పడిన ప్రాంతీయ రాజకీయ పా ర్టీల రంగప్రవేశం, వాటి ప్రభావాల కారణంగా కేంద్రంలో ఏర్పడిన మిశ్రమ ప్రభు త్వాల గురించి విశ్లేషించుకోవాల్సిన సమ యం ఆసన్నమైంది. 1952 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పా టు చేయడంలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నది.
అనంతరం 25 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా 1977లో జరిగి న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పా లైంది. అనంతరం మొట్టమొదటిసారిగా వి విధ రాజకీయ పార్టీలతో కూడిన కాంగ్రెసేతర మిశ్రమ ప్రభుత్వం జనతా పార్టీ అధి కారంలోకి వచ్చింది. జనతా పార్టీ నుంచి తొలి ప్రధానిగా ఎన్నికైన మొరార్జీ దేశాయ్ రెండు సంవత్సరాల 128 రోజుల పాలన తర్వాత చీలిక వచ్చింది.
ఈ నేపథ్యంలో చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన సైతం 170 రోజులకే పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనతా పార్టీ ప్రయోగం విఫలమైన అనంతరం ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వ చ్చింది. కానీ పంజాబ్ ఉగ్రవాదుల చేతిలో ఆమె మరణించారు.
సామాజిక న్యాయం..
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాం గ్రెస్ కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటుకు వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ‘తె లుగుదేశం’ పేరుతో 1983లో పాంత్రీయ పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన కొద్దికాలానికే ఎన్టీఆర్ అధికారంలోకి వ చ్చారు. అప్పటికే తమిళనాడులో ప్రాంతీ య పార్టీల హవా కొనసాగుతున్నది. కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో వామపక్ష వాదుల ప్రభుత్వాల పాలన అప్రతిహతం గా కొనసాగుతున్నది.
అనంతరం 1984 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ హత్యకు సంబంధించి సానుభూతి పవనాలు వీయడంతో రాజీవ్ గాంధీ ప్ర ధానమంత్రి అయ్యారు. తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లోకసభలో మెజార్టీ రాకపోవడంతో నేషనల్ ఫ్రంట్ అధికారం చేజెక్కించుకోవడంతో విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా మందిర్, మండల్ కమిషన్ ఉద్యమం దేశంలో అశాంతిని రేకెత్తించింది.
తత్ఫలితంగా వీపీ సింగ్ 143 రోజు లు, అనంతరం చంద్రశేఖర్ 223 రోజులు కొనసాగినప్పటికీ, అనేక లుకలుకలు బెకబెకల మధ్య ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటిసారి కేంద్రంలో వీపీ సింగ్ ఆధ్వర్యంలోని మండల కమిషన్ అమలుకు ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన వెనుకబడిన వర్గాలు అద్వానీ నిర్వహించిన మందిర్ (మండల్ వ్యతిరేక) రథయాత్రలో ఇటుకలు మోసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
దీంతో అప్పుడు అమలు కావాల్సిన సా మాజిక వర్గాల రిజర్వేషన్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండోసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ము కాశ్మీర్ వరకు నిర్వహించిన జోడో యాత్రతో మళ్లీ ఒక్కసారిగా సామాజిక న్యాయం తెరమీదకు వచ్చింది. ‘ఇన్ కీ జిత్ ని ఆబాది ఉన్ కీ ఉత్ ని భాగీ ధారీ’ అని రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదంతో వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనే ఎజెండా దేశ రాజకీయ పార్టీలకు ప్రధానంగా మారిపోయింది.
అంతేగాక రాహుల్ గాంధీ.. ‘భారత్ న్యాయయాత్ర’ పేరున 2024, జనవరి 14 నుంచి మార్చి 16 వరకు మణిపూర్ నుంచి బొంబాయి వరకు 62 రోజు లు పాదయాత్ర చేసి వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకాన్ని నేరుగా కలుసుకొని అనేక ప్రజా సమస్యలను తెలుసుకున్నా రు. ఈ యాత్రలో ప్రధానంగా రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యలు, ద్రవ్యోల్ప ణం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అమల్లో విఫలం..
రాహుల్ గాంధీ పేర్కొన్న సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణన ప్రక్రియను చేపట్టాయి. అంతేగాక తె లంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కావాలని కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చే శాయి. దీన్ని గవర్నర్‌కు తద్వారా రాష్ర్టపతికి శాసనసభ తీర్మానాన్ని ఆమోదం కో సం పంపారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆమోదం లభించలేదు.
పైగా పద్మ వ్యూహాన్ని అడ్డుకున్న సైంధవుడిలా కోర్టులు బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను కొట్టివేసి మోకాలు అడ్డుకున్నది. రాజ్యాంగం లో ఎక్కడ కూడా 50 శాతం రిజర్వేషన్లు దాటరాదనే నిబంధన లేకున్నప్పటికీ న్యా యస్థానాలే సైంధవుడి పాత్రను పోషిస్తున్నాయి. కోర్టుల్లో న్యాయమూర్తుల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడమే ఇందుకు కారణమనిపిస్తున్నది.
స్థా నిక సంస్థల్లోనే బీసీ రిజర్వేషన్ల దుస్థితి ఇ లా ఉంటే.. శాసనసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు ఎప్పుడు అవుతుందనేది అ ర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వారి వాదనలు వినిపించే ప్ర యత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బీసీ రిజర్వేషన్ల సమస్య మాత్రం ఒక కొలిక్కి రావ డం లేదు.
బీసీ రిజర్వేషన్ల విషయంపై అం దరూ ఏకీభవిస్తూనే అంతర్గతంగా విభేదిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు సమ్మతి తెలుపుతున్నట్టు పైకి చెబుతున్నప్పటికీ ఆయా పార్టీల రాజకీయ ఎజెండాను తెరపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్లు అమలయ్యే లా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారు.
ముగింపు పడేనా!
మొత్తానికి బీసీ రిజర్వేషన్లు అమలు కా కపోవడంపోవడంపై ఆయా రాజకీయ పార్టీల నాయకులు.. ‘మీరు కారణం అంటే మీరు కారణం’ అని ఒకరి మీద ఒకరు ఆ రోపణలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప అమలు విషయంలో ఒక్కతాటి మీద నిలబడలేకపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ వై ఖరి పట్ల ‘మౌనమే మేలు’ అనేలా వ్యవహరిస్తున్నాయి.
కానీ దేశంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు, ము ఖ్యంగా రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల కేం ద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 జనాభా లెక్కలు కులగణనకు అంగీకరించింది. బీసీలకు సంబంధించి పక్కా లెక్కలు తేలిన త ర్వాత బీసీల రిజర్వేషన్ల సమస్యకు ముగిం పు పడుతుందా లేదా అన్నది చూడాలి.
వ్యాసకర్త సెల్:- 9441078095