07-08-2025 01:28:28 AM
సిద్దిపేట రూరల్, విజయక్రాంతి; సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్‌లో రైతు ఆగ్రోస్ వద్ద యూరియా కోసం బుధవారం రైతులు పడిగాపులు కాశారు. సరిపడా యూరియా బస్తాలు లేకపోవడంతో సాయంత్రం వరకు వేచిచూశారు. కనీసం చాయ్ తాగడానికి వెళ్లినా వరుస తప్పుతుందని రైతులు దుకాణం ముందు వరుసలో కూర్చున్నారు. అధికారులు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.