calender_icon.png 7 August, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో రక్షాబంధన్ వేడుకలు

07-08-2025 07:12:47 PM

బోయినపల్లి (విజయక్రాంతి): బోయినపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని బోయినపల్లి మండలంలోని పాఠశాలల యందు తపస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తపస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, రక్షాబంధన కార్యక్రమం సోదర సోదరీ ప్రేమకు చిహ్నంగా నిర్వహించుకునే పండగ మాత్రమే కాదని దానితో పాటుగా అన్యాయం అధర్మం నుండి ధర్మాన్ని రక్షించడానికి పోరాటం చేయాల్సిన సమయంలో కంకణం కొట్టుకొని పోరాటం చేస్తారని అందుకు ఉదాహరణగా రాక్షసులపైకి ఇంద్రుడు యుద్ధానికి బయలుదేరిన సందర్భంలో శశిదేవి ఇంద్రునికి రక్షకట్టి యుద్ధానికి పంపించిందని యుద్ధంలో ఇంద్రుడు గెలిచాడని తెలిపినారు.

విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని అందుకు తపస్ ఉపాధ్యాయ సంఘం అలాంటి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తుందని తెలియజేసినారు. విద్యార్థులు కూడా చిన్ననాటి నుండి దేశం పట్ల ధర్మం పట్ల అభిమానాన్ని పెంచుకొని దేశసేవ కొరకు కంకణబద్దులు కావాలని విద్యార్థులకు సూచించినారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమని విద్యార్థులలో చిన్న మాటనుండే దేశభక్తి పెంపొందించే కకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, చంద్రం, జీవన్ సాయి, కుమారస్వామి, గంగ, విజయ, రవళి మొదలగువారు పాల్గొన్నారు.