calender_icon.png 7 August, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ అమ్మాయిల జోలికెళ్తే జైలుకే: ఎస్సై మధుసూదన్ రెడ్డి

07-08-2025 07:06:36 PM

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి(SI Madhusudhan Reddy) విజయక్రాంతి పత్రిక ప్రకటనలో గురువారం మాట్లాడుతూ... ఎవరైనా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లిన, వెంట పడ్డ, తీసుకెళ్లిన, తీసుకెళ్లే వారికీ సహకరించిన పోక్సో(POCSO) చట్టం కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఎస్సై మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం, మాయ మాటలు చెప్పి వెంట పడటం, తీసుకెళ్లడం చేస్తున్నారు.

ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్లిన, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు అతనికి ఎవరైనా సహకరించినా పోక్సో చట్టం 14 సం. (లేదా) యావజ్జీవ శిక్ష పడుతుందని అన్నారు. యువత ఇలాంటి జోలికి వెళ్లి వారి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. అలాగే తల్లి దండ్రులు మైనర్ పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారని, ముఖ్యంగా ఫోన్స్ విషయంలో, ఫోన్ ఛాటింగ్ విషయంలో గానీ పిల్లలపై నిఘా ఉంచాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిసై పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారని అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.