07-08-2025 06:45:35 PM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
సినియర్ సిటిజన్ సంరక్షణ చట్టం అమలు కు పకడ్బందీ చర్యలు..
సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేసులు ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టం అమలులో భాగంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసులో మానిటరింగ్ సిస్టం తయారు చేయడం జరిగిందని అన్నారు. సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేసులు ఆఫ్ లైన్ లో కాకుండా, ఆన్ లైన్ పోర్టల్ https://tgseniorcitizens.cgg.gov.in లో నమోదు చేయాలని అన్నారు. మీసేవ కేంద్రాలలో సీనియర్ సిటిజన్ కేసుల ఆన్ లైన్ ఫైలింగ్ చేపట్టాలని అన్నారు. ఆన్ లైన్ లో కేసు పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం అమలుకు పకడ్బందీ చర్యలు అధికారులు తీసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.