calender_icon.png 7 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఏడు వర్షాలు బాగా కురవాలని సూరయపల్లిలో గ్రామస్తుల కప్పతల్లి ఆట

07-08-2025 07:03:09 PM

మంథని (విజయక్రాంతి): ఈ ఏడు వర్షాలు బాగా కురవాలని మంథని మండలంలోని సూరాయపల్లి గ్రామంలో గురువారం గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కప్పతల్లి ఆట ఆడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్, మాజీ ఎంపిటిసి భీముని స్వామి, మాజీ వార్డు సభ్యులు ఆరెల్లి కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ కర్ణ కృష్ణలు మాట్లాడుతూ.. మంథని ప్రాంతంలో వర్షాల అధికంగా కురువకపోవడంతో మా ఊరి ఆనవాయితి ప్రకారం ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగిందని, సూరాయపల్లి హనుమాన్ దేవాలయంలో 108 బిందెల నీళ్లతో అభిషేకం, గ్రామదేవతలకు నీళ్లతో అభిషేకం చేశామన్నారు. వానదేవుడు కరుణించి వానలు కురవాలని పాడిపంటలు పండి, గ్రామల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కప్పతల్లి ఆట ఆడమన్నారు. అనంతరం ఆరెల్లి కిరణ్ గౌడ్  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కప్పతల్లి ఆటలు గ్రామ ప్రజలు, మహిళ సోదరిమణులు, రైతులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.