calender_icon.png 18 July, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హఠాత్తుగా కుప్పకూలిపోతున్న యువత జీవనశైలే కారణమా?

18-07-2025 12:00:00 AM

- యువతలో కొత్త ముప్పు గురించి డాక్టర్లు హెచ్చరిక

- సరైన జాగ్రత్తలతో ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్న హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిజు గోవింద్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే గుండె సంబంధిత సమస్యలు, ఇప్పుడు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బయటకు ఆరోగ్యంగా కనిపిస్తూ ఆకస్మికంగా కుప్పకూలిపోయే యువ త సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది గుండెపోటు కాదు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే తీవ్రమైన, నిశ్శబ్దంగా వస్తున్న ముప్పు.

గుండె సంబంధిత వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా 60 శాతం వరకు భారత్‌దే, కానీ మన జనాభా ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతం మాత్రమే. ఇదే సమయంలో 30 నుం చి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తుల్లో గుండె ఆగిపోవడానికి సంబంధించిన కేసులు 13 శాతం పెరిగాయని అమెరికన్ హార్ట్ జర్నల్ తెలిపింది. 2025 నాటికీ ఈ పెరుగుదల ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హోలిస్టిక్ హాస్పిటల్స్, హైదరాబాద్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిజు గోవింద్ ఈ పరిణా మాలపై హెచ్చరిస్తూ, ‘ఇది గుండెపోటుతో తలపోలేదు. ఇది గుండె విద్యుత్ వ్యవస్థ తారుమారై, ఆకస్మికంగా గుండె మోగడం ఆగిపోవడం.

నిమిషాల్లోనే ప్రాణాపాయం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న ప్రమాదానికి ప్రధాన కారణాలు ఎక్కువగా కూర్చున్న జీవనశైలి, తక్కువ వ్యాయామం, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్, పొగతాగడం, ఆల్కహాల్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పెరిగిన మెటబాలిక్ సిండ్రోమ్ కేసులు, కుటుంబ చరిత్ర/ జన్యుపరమైన సమస్యలు, కొలెస్ట్రాల్ 190 కంటే ఎక్కువగా ఉండటం, కుటుంబంలో 50 ఏళ్ల లోపు గుండె సంబంధిత చరిత్ర ఉండటం వంటివి ఫ్యామిలియల్ హైపర్‌కోలెస్టెరేమియా అనే జెనెటిక్ స్థితికి సంకేతాలు కావొచ్చు’ అని డాక్టర్ బిజు పేర్కొన్నారు. ఛాతీలో నొప్పి (10నిమిషాలకు పై గా), ఎడమ చేయి, దవడలో నొప్పి, తలతిరుగుడు, చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇ బ్బంది లాంటివి హెచ్చరిక సంకేతాలన్నారు.