మంత్రి పొన్నం చెంతకు ‘డీఎస్సీ’ పంచాయితీ!
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల వేళ కొన్ని స్కూల్స్‌లో ఉపాధ్యాయ ఖాళీల జాబితాను తప్పుగా ఇచ్చారన్న కారణంతో విచారణ ఎదుర్కొన్న డిప్యూటీ ఈవో, ఆరుగురు డీఐవోఎస్‌లపై చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డీఈవోకు ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
కాగా సదరు డిప్యూటీ ఈవో, డీఐవోఎస్‌లు చివరి ప్రయత్నంగా ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు ను పలువురు యూనియన్, ఉపాధ్యాయ నేతలతో కలిసి వినతి ఇచ్చినట్టు సమాచా రం. ఈ విషయం జిల్లా విద్యాశాఖలో చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే జిల్లా ప్రత్యేక మెజిస్ట్రేట్‌తో జరిగిన విచారణలో నియామకాల్లో తప్పులేవీ జరగలేదని గుర్తించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు.
ఎఫ్‌ఏసీలు మాకొద్దు!
జిల్లా విద్యాశాఖలో 12మంది డిప్యూటీ ఈవోలు, 24మంది డీఐవోఎస్‌లు ఉన్నారు. వీరంతా పాఠశాలల్లో హెచ్‌ఎం లుగా విధులు నిర్వహిస్తూనే డిప్యూటీ ఈవో, డీఐవోఎస్‌లుగా ఫుల్‌అడిషనల్ చార్జి (ఎఫ్‌ఏఎస్)గా బాధ్యతలు నిర్వహి స్తున్నారు.
కాగా ఈ విద్యాసం వత్సరం ఆరంభం నుంచి విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పలువురు డిప్యూటీ ఈవోలు, డీఐవోఎస్‌లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీని కలిసి తమకు ఎఫ్‌ఏసీలను తొలగించాలని కోరినట్లు తెలిసింది. తాజాగా జరుగుతున్న డీఎస్సీ నియామకాల్లో జాప్యం అంశంతో మరికొందరు అదే బాట పట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం.




