22 April, 2026 | 12:23 AM

ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదు

24-06-2025 01:45 AM

అమెరికాను ఒక్క మాట కూడా అనని ఖమేనీ

టెహ్రాన్, జూన్ 23: ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట అమెరికా ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేసింది. ఘోరమైన నేరానికి పాల్పడింది. దానికి శిక్ష వేస్తాం. తప్పకుండా శిక్ష అనుభవిస్తుంది.’ అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. దాడులు చేసిన అమెరికాను మాత్రం ఖమేనీ పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. ఇరాన్‌ను శిక్షిస్తామని ఆయన ప్రతినబూనారు.