21 April, 2026 | 10:55 PM

యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగదు

24-06-2025 01:46 AM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

టెల్ అవీవ్, జూన్ 23: ఇజ్రాయెల్ యుద్ధం మరెంతో కాలం కొనసాగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన అనంతరం నెతన్యాహు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్‌పై దాడులు చేపట్టగా.. అమెరికా ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరిట విరుచుకుపడింది.

అమెరికా దాడుల అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడా రు. ‘టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. అణుముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు మరెంతో కాలం పట్టదు. లక్ష్యం చేరుకున్నాక యుద్ధం ఆగిపోతుంది.’ అని పేర్కొన్నారు. ఫలితం రాకముందు యుద్ధం నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు.