calender_icon.png 8 July, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభాంశుతో ఇస్రో చీఫ్ ముచ్చట

08-07-2025 12:00:00 AM

పరిశోధనలు, ఆరోగ్యంపై ఆరా

బెంగళూరు, జూలై 7: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎ స్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ఇస్రో చైర్మన్ వీ నారాయణన్‌తో ఫోన్‌లో ముచ్చటించారు. యాక్సియం మిషన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు తన గ్రూప్‌తో కలిసి 14 రోజులు పరిశోధన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్లా ఆరోగ్యంపై ఇస్రో చైర్మన్ ఆరా తీశారు.

స్పేస్ స్టేషన్‌లో జరుగుతున్న వివిధ రకాల శాస్త్రీయ పరిశోధనల గురించి ఆరా తీశారు. అన్ని పరివోధనలు, కార్యక్రమాలకు చెందిన శుక్లా అనుభ వాలను డ్యాక్యుమెంట్ చేయాలని ఇస్రో చైర్మన్ భావిస్తున్నారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్ చేపడుతున్న  నేపథ్యంలో శుక్లా అనుభవాలు ఉపయోగపడుతాయని ఇస్రో అంచనా వేస్తోంది.