08-08-2025 01:36:15 AM
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
చిన్నశంకరంపేట/చేగుంట, ఆగష్టు 7 : పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజా పాలన సాగుతుందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. చిన్నశంకరంపేట పట్టణ కేంద్రం లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, పదేళ్ల కాలంలో చేయని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రేషన్ కార్డు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ మాలతి, ఆర్.ఐ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ప్రభాకర్, నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ సర్పం రాజిరెడ్డి, పుల్లారావు, నాయకులు, కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.