calender_icon.png 26 January, 2026 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతపురంలో ఇసుజు మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

26-01-2026 08:42:04 PM

అనంతపురం: కీలక ప్రాంతీయ మార్కెట్లలో కస్టమర్ల సౌకర్యం కోసం ఇసుజు మోటార్స్ తన సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇసుజు మోటార్స్ ఇండియా అనంతపురములో తన కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ (ఏఎస్‎సి) టోలీ మోటార్స్ ను అనంతపురంలో ప్రారంభించింది. ఈ  సర్వీస్ సెంటర్ ను ఇసుజు మోటార్స్ ఇండియా సీనియర్ అధికారులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో నెట్ వర్క్ టచ్‎పాయింట్ ప్రారంభించడం ద్వారా తన అమ్మకాల-అనంతర మౌలికసదుపాయాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యమంటున్నారు.

రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులో సేవా సహకారాన్ని అందించాలనే కంపెనీ యొక్క ప్రయత్నాల్లో భాగంగానే దీనిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అనంతపురములోని కొత్త సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఐఎంఐ యొక్క 8వ కస్టమర్ టచ్‎పాయింట్ అనీ, ఇది రాష్ట్రంలోని కంపెనీ సర్వీస్ నెట్ వర్క్ ను మరింత శక్తివంతం చేసుందనీ ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టోరు కిషిమోటో అన్నారు.

ఈ ప్రాంతంలో వినియోగదారులకు విశ్వసనీయమైన, అధిక-నాణ్యత కలిగిన సేవలను అందించాలన్న నిబద్ధతే తమ లక్ష్యమని తెలిపారు. ఇసుజు మోటార్స్ ఇండియా వారి భాగస్వాముతో అనంతపురములో కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ ప్రారంభినందుకు సంతోషంగా ఉందని,  ఆధునిక సదుపాయాలు ,సుశిక్షితులైన సిబ్బందితో అధిక-నాణ్యత కలిగిన సేవలను అందిస్తామని  టోలీ మోటార్స్ డీలర్ ప్రిన్సిపల్ ఆదినారాయణ చెప్పారు.