21 August, 2026 | 4:35 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

ఏఈఈ పోస్టింగ్లు ఇవ్వకపోవడం బాధాకరం

12-06-2024 02:13 AM

నియామక  పత్రాలు వెంటనే అందజేయాలి

ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా,  ప్రభుత్వం ఇంతవరకూ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని గుర్తు చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి నా ఇంకా నియామక పత్రాలు విచారకరమని మండిపడ్డారు. వెంటనే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.