కీరవాణి కంటే గొప్ప సంగీత దరకుడు లేరనడం విచారకరం
31-05-2024 12:06 AM
సంగీత దరకుడు ఎసీ మల్లిక్ తేజ
జగిత్యాల, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గేయానికి బాణీ సమకూర్చేందుకు సంగీత దరకుడిగా తనకు అవకాశం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, రచయిత అందెశ్రీ మోసం చేశారని సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్‌తేజ ఆరోపించారు. ఈ విషయాన్ని గురువారం విజయక్రాంతి ప్రతినిధితో వెల్లడించారు. కీరవాణి కంటే గొప్ప సంగీత దరకుడు లేడని అనడం తెలంగాణ కళాకారులను అవమానించిన ట్లేనని ఆవేదన చెందారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క కోరిక మేరకు జయ జయహే తెలంగాణ పాటకు ఏడాది క్రితమే తాను సంగీతం సమకూర్చినట్లు చెప్పారు. కవి అందెశ్రీ కూడా తనను మెచ్చుకున్నట్లు చెప్పారు. గేయానికి బాణీ కట్టే అవకాశం ఇస్తామని మరోసారి ఇలా అన్యాయం చేస్తారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు.






