30 June, 2026 | 2:12 AM

దేశ ఆర్థిక శ్రేయస్సును అందించేది చార్టర్డ్ అకౌంటెంట్లే

30-06-2026 12:00 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వేముల

ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాం తి): ఆర్థిక శ్రేయస్సును అందిస్తూ చార్టర్డ్ అకౌంటెంట్లు భారతదేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీఏ చంద్రశేఖర్ వేముల అన్నా రు. ఆర్థిక రికార్డులను ఆడిట్ చేయడం, నియంత్రణల అనుగుణ్యతకు హామీ ఇవ్వడం, వ్యూహాత్మక పన్ను,  వ్యాపార సలహా సేవలను అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని,  పారదర్శకతను పాటించాలని కోరారు. 

హైదరాబాద్ సికింద్రాబాద్ తాజ్‌త్రిస్టార్ హోటల్‌లో సోమవారం  తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రెం డు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 300 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఏ చంద్రశేఖర్ వేముల మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2026న పూర్తిగా అమల్లోకి వచ్చిన నూతన ఆదాయపు పన్ను చట్టం, 2025పై చార్టర్డ్ అకౌంటెంట్లు తప్పనిసరిగా పట్టు సాధించాలన్నారు.

క్లయింట్లకు వేగవంతమైన సేవల ను అందించడం కోసం, ప్రాక్టీషనర్లు ఆదాయపు పన్ను శాఖ యొక్క కొత్త డిజిటల్ ప్రచార వేదికలైన ’కర్ సాథీ’,  ’కర్ సేతు’  ఉపయోగించుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను చెల్లింపులు పెరిగేలా కృషి చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో తో డ్పడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు హితేష్ జైన్, కళ్యాణ్ దాస్, వేణుగోపాల చారీ, జెవి రావు, డి. బాలాజీ, యు.ఎల్.వి. సుధాకర్, హేమేం ద్ర షా, కృష్ణ మూర్తి, ఈశ్వరన్, బొజ్జ మధుసూదన్, శాంతిశ్రీ, ప్రస్తుత   కార్యదర్శి సీఏ ఆశిష్ జోషి, కోశాధికారి  సోమేశ్వర్ నెమ్మా ని, సలహాదారు  సీఏ రామ్దేవ్ బుటాడా, కంపిటేషన్ కమిటీ చైర్మన్ సీఏ అమృత్ కుమార్ కోటా, ఉపాధ్యక్షులు సీఏ పి.వి. నా రాయణరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సీఏ ప్రవల్లిక వేముల, సిఎ ప్రకాష్ చోకదా, సీఏ వెంకట్ రామ్, సీఏ శైలేంద్ర శర్మ, సిఏలీల కృష్ణ మోహన్,  ఎన్.వి. చారి, అజయ్ వాల్వే, ఏపీ దహిమా పాల్గొన్నారు..