09-02-2025 06:50:39 PM
నియోజకవర్గ వ్యాప్తంగా కంటిచూపు కోల్పోయిన వారికి ఉచిత వైద్య శిబిరం..
1058 మందికి కంటి వైద్య పరీక్షలు, చూపు మందగించిన 216 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): కంటి చూపు కోల్పోయిన నియోజకవర్గ ప్రజలకు జీవించినంతకాలం కంటికి రెప్పలా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 1058 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపు మందగించిన 216 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ చేయించిన వారికి మరల వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేసిన కన్ను ఎలా ఉంది అని పరీక్షలు చేయించారు.
310 మంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 124 మందికి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. 58 మందిని వెంటనే ఆపరేషన్ కోసం హైదరాబాద్ తరలించారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరిని పరిశీలించి వారి కంటిచూపు మెరుగయ్యేంత వరకు వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న రాజగోపాల్ రెడ్డి పట్ల నియోజకవర్గం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.