calender_icon.png 21 January, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులను మోసం చేసి ఉత్సవాలు జరుపుకోవడం అవివేకం

04-12-2024 09:49:27 PM

బీజేవైఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

హుజురాబాద్ (విజయక్రాంతి): యువకులను మోసం చేసి ఉత్సవాలు జరుపుకోవడం సీఎం రేవంత్ రెడ్డి అవివేకమని బీజేవైఎం నాయకుడు పవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బీజేవైఎం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కింద ఇస్తామని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రలోభ పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి పబ్లిక్ మీటింగ్లలో చిల్లర మల్లర మాటలతో రాష్ట్ర పరువును తీస్తున్నాడని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉత్సవాలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే. బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, మురహరిగోపాల్, జగన్ రెడ్డి, ఉమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.