21-12-2025 12:00:00 AM
మణికొండ, డిసెంబర్ 20 (విజయక్రాతి) : మణికొండ సర్కిల్ పరిధిలో జలమండలి నీటి బిల్లుల విషయంలో క్యాన్ నెంబర్ కేటాయిస్తూ ఏకంగా 56 నెలల బకాయిలు వసూలు చేయడం సరికాదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరా లోచన చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుతూ జలమండలి ఎండి అశోక్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
ఈ అంశంపై స్థానిక మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణారెడ్డి, జి. శ్రావణ్ కుమార్, పలు కాలనీ సంఘాల నాయకులు జలమండలి ఎండి అశోక్ రెడ్డి, జిఎం శ్రీనివాస్ రెడ్డిలను ప్రత్యక్షంగా కలిశారు. ప్రజలపై ఆర్థిక భారం మోపవద్దని, జలమండలి క్యాన్ నెంబర్ కేటాయించినప్పటి నుంచి మాత్రమే బిల్లులు వసూలు చేయాలని, పాత బకాయిల పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు.