21-12-2025 12:00:00 AM
సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షల మధ్యలో అంతరాన్ని తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఒక్కొక్క పరీక్షకు వ్యవధి 5 రోజుల ఉండటం వలన మొత్తం పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజులు అవుతుందని, దీని వలన విద్యార్థులు అధిక భారంగా చూస్తున్నారని చెప్పారు. ఆ వ్యవధి తగ్గించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆయన కార్యదర్శి అజిత్‌రెడ్డిని అంశాన్ని పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు.