విరసం సభను అడ్డుకోవడం తగదు
మానవ హక్కుల వేదిక
హైదరాబాద్, జూల్ 6 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం (విరసం) నిర్వహించదలచిన సభను అడ్డుకోవడాన్ని మా నవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ సభ ఈ నెల 5న హైదరాబాద్‌లోని సుం దరయ్య భవన్ ప్రాంగణంలో జరగాల్సింది. హాలులో జరుపదల్చిన ఒక శాంతియుత ప్ర జాస్వామిక సమావేశాన్ని నిరోధించడం రా జ్యాంగబద్ధ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమై న చర్య అని మానవ హక్కుల వేదిక ఎస్ జీ వన్ కుమార్ (సమన్వయ కమిటీ సభ్యులు), డా. ఎస్. తిరుపతయ్య (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) అన్నారు. ‘ఇది పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛలపై నేరుగా దాడి చే యడమే.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత, ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛకు గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేయదలచుకున్నాం. ప్రస్తుత పోలీసు చర్య అత్యంత ఆందోళనకరమైనది. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కుల పరిధి కుం చించుకుపోతున్నదనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తోంది. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని, ఈ విషయాన్ని సమీక్షించి, ప్రజాస్వామిక కార్యకలాపాలపై పోలీసులు ఇష్టానుసారంగా, ఆంక్షలు విధించకుండా త గిన ఆదేశాలు ఇవ్వాలి’ అని వారు కోరారు.






