7 July, 2026 | 2:16 AM

వేములవాడ ఆలయానికి సేఫ్ లాకర్

07-07-2026 12:00 AM

ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అందజేత

వేములవాడ, జూలై 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రా జరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఇండియన్ బ్యాంక్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో సు మారు రూ.50 వేల విలువైన గోద్రెజ్ సేఫ్ లాకర్‌ను విరాళంగా అందజేశారు. దేవస్థా నం ప్రోటోకాల్ కార్యాలయంలో జరిగిన కా ర్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఆలయ ఈఓ రమాదేవికి లాకర్ అందించారు.  ఈఓ బ్యాంక్ వారిని అభినందించి, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.