02-05-2025 12:16:35 AM
చికాగో అమరవీరుల స్పూర్తితో కార్మిక, కర్షకులు రాజ్యాధికారంకోసం పోరాడాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
జిల్లాలో రెపరెపలాడిన ‘అరుణ పతాకం’
సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (విజయక్రాంతి) సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో మగ్గు తున్న శ్రామిక వర్గాన్ని రక్షించేది ఎర్రజెండా నేనని, చికాగో అమరవీరుల స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం కార్మికులు కర్షకులు ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మే డే ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఏఐటీఈసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అరుణ పతాకం రెపరెపలాడింది. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కార్మిక క్షేత్రాలు, కార్మిక వాడలు, ఉద్యోగ క్షేత్రాలు, బస్తీలు, గ్రామాల్లో ఎర్రజెండా రెపరెపలాడింది.
పార్టీ కార్యాలయాలు, విద్యానగర్ బై పాస్ రోడ్డు, గ్రామపంచాయతి కార్యాల యం, ఆటో, హమాలీ, సింగరేణి ప్రధాన కార్యాలయం, రైతుబజార్, భవన నిర్మాణ కార్మికుల అడ్డా, పాల్వంచ మున్సిపాలిటీ కా ర్యాలయం సమీపంలో తదితర ప్రధాన సెంటర్లలో ఆయన మేడే జెండాను ఆవిష్కరించారు. చికాగో అమరవీరులకు నివాలుల ర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభ ల్లో కూనంనేని మాట్లాడుతూ ప్రపంచ వ్యా ప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే అని అన్నారు.
1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానం కోసం జరిగిన సమ్మె సందర్భంగా పాలకు లు, యాజమాన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిందే ఈ ఎర్రజెండా అని పేర్కొన్నారు. వారి అమరత్వంతోనే ఎనిమిది గంటల పనివిధానంతో పాటు అనేక కార్మిక చట్టాలు, హక్కులు ఏర్పడ్డాయని, చికాగో అమరుల స్పూర్తితో భార తదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు ఏలికలు దిగిరాక తప్పలేదన్నారు.
బ్రిటీష్ రాజ్యంలో, ఆ తర్వాత స్వతంత్ర భారతంలో పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను ఏకమొత్తంగా బిజెపి ప్రభుత్వం రద్దు చేసే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. చట్టసభల్లో ఉన్న మందబలంతో కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని, లాభా ల్లో నడుస్తున్న సింగరేణి గనులు, రవాణా, టెలికాం, రైల్వే, బ్యాంకులు, ఎల్‌ఐసి,రక్షణ రంగం, ఇస్రో లాంటి తదితర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పణంగా కట్టబెట్టిందని విమర్శించారు.
ప్రజల కోసం కాకుండా ఆర్ధిక బకాసురులకు, ఆర్ధిక నేరగాళ్ళగా మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మ ధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బంగడుకుంటుందే తప్ప దేశ ప్రజలకు మోడీ ప్రభు త్వం చేసింది శూన్యమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేలా బిజెపి వ్యవహరిస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అ వసరం ఉందన్నారు.
139వ మేడే స్పూర్తితో ప్రజాస్వామ్య రక్షణ, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం క మ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, జి నగేష్, కందుల భాస్కర్, భూక్యా శ్రీనివాస్, అరుసుమల్లి సాయిబాబా, నాగేశ్వరరావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం
ఖమ్మం, మే1, (విజయక్రాంతి) : పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిపిఐ జాతీయ సభ్యులు భాగం హేమంతరావు స్పష్టం చేశారు. ఖ మ్మం జిల్లాలో గురువారం సిపిఐ, ఏ ఐ టి యూ సి , అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహిం చారు.139వ మేడేను భారత కమ్యూనిస్టు పార్టీ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ఇందిరా నగర్ పర్ణశాల వద్ద గల ఏఐటియుసి, సిపిఐ పైలాన్ వద్ద సిపిఐ పతాకాన్ని ఆయన ఆవిష్కరించగా, ఏఐటియుసి పతాకాన్ని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు బిజి క్లెమెంట్ ఆవిష్క రించారు. ఖమ్మం నగరం తో పాటు, మం డల వ్యాప్తంగా అరుణ పతాకం రెపరెపలాడింది.ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో బాగం హేమంతరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆయన తెలిపారు. శ్రమ దోపిడీ తీరు మారుతుందన్నారు.
ఒకప్పుడు సంక్షేమానికి ముఖ్యంగా ఉత్పత్తి కారకులైన కార్మికుల సంక్షేమానికి పాలకులు పెద్ద పీట వేసేవారని కానీ దశాబ్ద కాలంగా కార్మికుల సంక్షేమం కోసం లక్ష కో ట్లు కేటాయిస్తే కార్పొరేట్ శక్తులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయడానికి రూ.16.50 లక్షల కోట్లు వెచ్చించారని ఆయ న తెలిపారు. మోడీ అంటే కార్పొరేట్ శక్తుల చుట్టమని కార్మిక, శ్రమ జీవులకు శత్రువన్నారు.
మే 20న జరిగే సార్వత్రిక సమ్మెకు రైతులు, కార్మికులు, యువజన విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మద్దతు పలికి ప్రభుత్వ ఏకపక్ష విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా సమితి సభ్యు లు ఏనుగు గాంధీ ఆహుతులను వేదికపైకి ఆహ్వానించగా ఈ సభలో సిపిఐ రాష్ట్ర సమి తి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు,
పోటు కళావతి, బిజి క్లెమెం ట్, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, రావి శివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ. ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు నానబాల రామకృష్ణ. ఇటికాల రామకృష్ణ, పలువురు నగర సమితి సభ్యులు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.