calender_icon.png 3 May, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాభివృద్ధికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది

02-05-2025 12:19:02 AM

కలెక్టర్ ఎం హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, మే 1 (విజయక్రాంతి): రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ధీరజ్ కుమార్  ఎంపీసీలో 98.09%, అదే కళాశాలలో ఇంటర్ చదివిన శ్రేష్ట సీఈసీ 91.60%, ఒకేషనల్ కోర్స్‌లో  ఎంఎల్‌టీలో నందిని 98.80% , వలిగొండ ఎస్‌వీ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ చదివిన గంజి సరస్వతి బైపీసీ 96.59%, యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన అభిలాష హెచ్‌ఈసీ 93.40 శాతం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల కలెక్టర్ ఎం హనుమంతరావు శాలువాలు కప్పి మేమేంటోలతో సన్మానించి అభినందించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల కళాశాల ప్రిన్సిపల్స్‌తో సమీక్ష సమావేశం  ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... సమాజాభివృద్ధికి  విద్య ఎంతగానో దోహదం చేస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహించాలని ఆత్మవిశ్వాసం కల్పించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి కి మార్గదర్శకులు కావాలని ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థుల్లో నమ్మకం కలిగేలా అంకితభావంతో పని చేయాలన్నారు.  పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ  కళాశాలలో చేరే విధంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఫ్లెక్సీ, పాంప్లెట్ల  ద్వారా అత్యధిక మార్కులు  సాధించిన వారి వివరాలను పొందుపరిచి విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అన్నారు.

మొదటి ,రెండు సంవత్సరాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని  చదివించి సప్లమెంటరీ పరీక్షలలో అందరూ పాసై  డిగ్రీలో చేరేలా చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, ఎస్సీ షెడ్యూల్ కులాల శాఖ అభివృద్ధి అధికారి వసంతకుమారి, ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు  పాల్గొన్నారు.