02-05-2025 12:16:07 AM
కరీంనగర్ క్రైమ్ మే 1 (విజయక్రాంతి): బి అర్‌ఎస్ కార్మిక విభాగం బి అర్ టి యు అధ్వర్యంలో గురువారం నగరంలో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గంగుల
నగరంలోని 21వ డివిజన్లో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్‌తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, 21వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మహేష్, అధికారులు, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.