calender_icon.png 17 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డు పంపిణీ

17-09-2025 10:45:52 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  జన్మదినం, తెలంగాణ విమోచన దినం సందర్భంగా బుధవారం ఘట్ కేసర్ లో వైఎస్ఆర్  ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందని మాజీ ఎంపీపీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ట్రస్టు వ్యవస్థాపకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఘట్ కేసర్ శివారెడ్డి కూడా సమీపంలోని బైపాస్ చౌరస్తా వద్ద ఉదయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.

భవన నిర్మాణ కార్మికులు అనగా నిర్మాణ కూలీలు, తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ పనివారు, ఎలక్ట్రిషన్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, టైల్స్ పనివారు, పెయింటర్లు, ప్లంబర్లు, ఫాల్ సీలింగ్ పనివారు మొదలగు నిర్మాణ కూలీలందరూ లేబర్ కార్డు పొందుటకు అర్హులన్నారు. కార్డు పొందిన కార్మికుడికి వర్తించే ఉపయోగాలు తెలియజేశారు.కార్మికునికి ఇన్సూరెన్స్ సహజ మరణానికి ఒక లక్ష 30 వేలు, యాక్సిడెంట్ రూ. 6లక్షలు వివాహ కానుక కార్మికుని కూతురు వివాహానికి రూ. 30 వేలు ఇద్దరు కూతుర్లకు వర్తిస్తుంది.  ప్రసూతి కానుక  నిర్మాణ కూలి భార్య కానీ కూతురు కానీ ప్రసవిస్తే రూ. 30 వేలు, రెండు కాన్పులకు వర్తిస్తుంది. కావలసిన సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు)  ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్,  ఒక ఫోటో అవసరం ఉంటుందన్నారు. ఘట్ కేసర్ పరిసర ప్రాంతాల్లోని భవన నిర్మాణ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నామని సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.