calender_icon.png 17 September, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

17-09-2025 11:36:56 AM

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, వ్యవసాయ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ,అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ వైస్ చైర్మన్ మోడెం శ్రీలత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ మార్కెటకార్యదర్శిసురేష్, మార్కెట్కమిటీడైరెక్టర్స్, ట్రేడర్స్, మార్కెట్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు  పాల్గొన్నారు.