17-09-2025 10:49:22 AM
హుజూర్ నగర్ ఎంఈఓ భూక్య సైదా నాయక్
హుజూర్ నగర్: రేపటి తరానికి ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని హుజూర్ నగర్ మండల(Huzurnagar Mandal) విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి పలువురు మాట్లాడారు... ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని నేటి డిజిటలైజేషన్ యుగములో విద్యార్థిని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయులదన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులు సమాజ నవ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శాలువా మెమెంటో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లావణ్య, మఠంపల్లి మండల విద్యాధికారి వెంకటా చారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి, పెనుగొండ శ్రీనివాస్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నలబోలు శ్రీనివాస్ రెడ్డి, దాడి నర్సిరెడ్డి, జహర్ అలం,అంకతి అప్పయ్య వేముల శ్రీనివాస్ రాజశేఖర్ రెడ్డి అత్తి వెంకటేశ్వర్లు, సిఆర్పిలు,పాల్గొన్నారు.