calender_icon.png 17 September, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

17-09-2025 10:47:31 AM

గుమ్మడిదల, (విజయక్రాంతి): గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని దోమడుగులో సాయంత్రం విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విశ్వకర్మ సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... శ్రీ విశ్వకర్మ భగవాన్ కృపతో నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో   మంగయ్య, వినోద్, బ్రహ్మచారి, పద్మాచారి, యాదయ్య చారి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.