calender_icon.png 17 September, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసిన ఉద్యోగులు

17-09-2025 11:20:26 AM

జెండావిష్కరణలో కనిపించని తెలంగాణ తల్లి ఫోటో

దౌల్తాబాద్, (విజయక్రాంతి): దౌల్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ(Telangana Praja Palana Dinotsavam ) వేడుకల సందర్భంగా నిర్వహించిన జెండావిష్కరణ కార్యక్రమంలో విస్మయానికి గురిచేసే సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే తెలంగాణ తల్లి ఫోటో ప్రతి అధికారిక కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రతిష్ఠించాల్సి ఉంటుంది.

అయితే స్థానిక మెడికల్ ఆఫీసర్ నాగరాజు, ఐకెపి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మహిపాల్ నిర్లక్ష్యం కారణంగా జెండావిష్కరణ(Flag unveiling) వేదికపై ఆ ఫోటో కనిపించక పోగా అధికారికంగా ఆమోదించని తెలంగాణ తల్లి ఫోటో(Telangana Thalli Photo) పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.