calender_icon.png 17 September, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్

17-09-2025 11:30:15 AM

  1. హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతాం.
  2. హైదరాబాద్ డ్రగ్స్‌కు గేట్ వేగా మారింది.
  3. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశాం. 
  4. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కఠినంగా వ్యవహరిస్తాం. 
  5. ప్రజలు అండగా ఉంటే మత్తు మాఫియాను తరిమికొడతాం.

హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్(Hyderabad Public Gardens) లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2025 వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. హైదరాబాద్ అంటనే ఒక బ్రాండ్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామన్నారు. 2047 నాటికి మనరాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం, కాలుష్యం లేదని నగరంగా హైదరాబాద్ ను మారుస్తున్నామని పేర్కొన్నారు. మూసీ నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు. మూసీ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. పర్యాటకులకు ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 9లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి త్వరలోనే మెట్రో విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 

తెలంగాణ అంటే పోరాటాలకు, త్యాగాలకు వేదికన్న ఆయన యువతపాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామని చెప్పారు. గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ అరికట్టడంలో మన పోలీసులు సత్తా చాటారని సీఎం ప్రశంసించారు. 138 దేశాల్లో పోటీ జరిగితే మన పోలీసులు ప్రథమ స్థానం సాధించారని కొనియాడారు. పిల్లలు డ్రగ్స్ కు బానిసలు కాకుండా అందరూ చొరవ చూపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనవాళ్లే ఉండకూడదని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. భావితరాలకు విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలనేదే మా ప్రయత్నమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న రాష్ట్రప్రజలకు అందిస్తామన్నారు.ఈ విజన్ డాక్యుమెంట్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని సీఎం తెలిపారు. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామని సీఎం తెలిపారు. గొప్ప నగరం నిర్మించుకునే అవకాశం మనకు దక్కిందన్నారు. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా అభివృద్ధి సూచిక కానుందని తెలిపారు. 12 రేడియల్ రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.