19-08-2025 01:03:55 PM
హైదరాబాద్: మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి(Former MP Ranjith Reddy) ఇంట్లో మంగళవారం ఐటీ అధికారులు సోదాలు(IT Raids) నిర్వహిస్తున్నారు. రంజిత్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎస్ఆర్ గ్రూప్(DSR Group) కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న రంజిత్ రెడ్డి.. డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ తో వ్యాపార లావాదేవీలు జరిపారు. ఐటీ అధికారులు డీఎస్ఆర్ గ్రూప్ నిర్మాణ సంస్థ, డీఎస్ఆర్ గ్రూప్ కంపెనీలతో పాటు డీఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో, వారి కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏకకాలంలో పది చోట్ల 15 ఐటీ బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని పది చోట్ల ఐటీ అధికారులు సీఆర్‌పీఎఫ్(CRPF) బలగాలతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకలో డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి సోదాలు జరుగుతున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఒకేసారి 30 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.