calender_icon.png 10 September, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఆత్మగౌరవాన్ని పెంచింది కమ్యూనిస్టులే

10-09-2025 12:29:15 AM

బి వి.రాఘవులు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మంగళవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో ‘వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ‘ప్రజా విజయాలు-వాస్తవాలు- వక్రీకరణలు అనే అంశంపై సిపిఎం జిల్లా ప్రజా సదస్సు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అధ్యక్షతన జరిగింది. ఇ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పొలీట్ బ్యూరో సభ్యులు బీవి,రాఘవులు మాట్లాడుతూ. 

వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం ప్రపంచంలో ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు నాడు తెలంగాణ ప్రాంతంలో దొరలు, జాగిర్దారులు, పటేల్ పట్వారిలు, నైజాం రజాకారు యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి జరిపిన మహోన్నత పోరాటమన్నారు ఈ పోరాటం దోపిడీ, పీడనలను,వెట్టి చాకిరిని నిర్మూలించడమే కాకుండా ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు.

సుమారు 4000 మంది రక్త తర్పణతో లక్షలాధి ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిందన్నారు  బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, సి నారాయణ రెడ్డి, కాలోజి నారాయణరావు లాంటివారు అనేకమంది సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. ఘనమైన చరిత్ర కలిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింలు గొడవగా వక్రీకరణ చేయాలని భావిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లకు ఈ పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే చరిత్ర హీనులవుతారని అన్నారు 4000 మంది కమ్యూనిస్టు యోధుల బలిదానమే వీరోచిత సాయిధర రైతాంగ పోరాటమని గుర్తు చేశారు. మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పల్లె,పల్లెకు, చెట్టుకు, పుట్టకు ఒక చరిత్ర ఉందని ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు తాతల, తండ్రుల వారసత్వం కలిగి ఉందని చరిత్రను వక్రీకరించాలని చూస్తున్న బిజెపికి ఏముందో  చూపెట్టగలరా అని ప్రశ్నించారు!! 

సాయుధ పోరాట చరిత్ర స్ఫూర్తితో నాడు జాగీర్దారులు, పటేల్, పట్వారిలకు, రజాకార్ మూకలకు వ్యతిరేకంగా పోరాడినట్లే నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాదంపై పోరాడాలని మత చిచ్చు రేపి తమ పబ్బము గడుపుకోవాలని చూస్తున్న మతోన్మాదముకలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల వారమవుతామని, మతోన్మాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం,దాసరి పాండు, గుంటోజు  శ్రీనివాసచారి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, పైళ్ల యాదిరెడ్డి,గద్దె నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, బోలగాని జయ రాములు. దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎండి పాషా, బొడ్డుపల్లి వెంకటేశం,గుండు వెంకట నర్సు, గంగదేవి సైదులు,దోడ యాదిరెడ్డి,మద్దేపురం రాజు, అవ్వారు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ,

యంఏ.ఇక్బాల్ వనం ఉపేందర్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశం, రాగిరు కిష్టయ్య, మల్లెపళ్లి లలిత, బల్గూరి అంజయ్య, కోట రామచంద్రారెడ్డి, గోశిక కరుణాకర్, పైళ్ల గణపతి రెడ్డి, దూపటి వెంకటేష్,ర్యాకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, వేముల బిక్షం, గాడి శ్రీనివాస్, కొల్లూరు ఆంజనేయులు, బుర్రు అనిల్,నూకల భాస్కర్ రెడ్డి, రామచంద్రం వివిధ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.