calender_icon.png 10 September, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో ఘనంగా కాళోజీ 111వ జయంతి

10-09-2025 12:28:16 AM

పటాన్చెరు, సెప్టెంబర్ 9 :తెలంగాణ కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు 111వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ లైఫ్ విభాగం మంగళవారం ఘనంగా నిర్వహించారు. 1992లో కాళోజీకి పద్మవిభూషణ్ అవార్డును ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించగా, ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు కాళోజీ శాశ్వత వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా కవికి ఘన నివాళులు అర్పించారు.