10-09-2025 12:29:15 AM
మునిపల్లి, సెప్టెంబర్ 9: అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాల రేషన్ బియ్యాన్నిమునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుంచి గుజరాత్ కు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ లారీని తనిఖీ చేయగా అందులో ఎలాంటి పత్రాలు లేకుండా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పట్టుబడిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు లారీని సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సదరు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపారు.