calender_icon.png 27 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో నాలుగు రోజులు వర్షాలే

27-07-2025 12:23:11 AM

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిస్తే, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది.

ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 కి.మీ.వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యాపారస్తులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.