27-07-2025 12:22:58 AM
డాక్టర్ నరేశ్‌కుమార్‌కు మోస్ట్ పాపులర్ వైశ్య మేల్ అవార్డు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వె న్షన్‌లో శనివారం వైశ్య లైమ్‌లైట్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. టీఎక్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ నరేష్ కుమార్ గజ్జల 2025 సంవత్సరానికి ‘మోస్ట్ పాపులర్ వైశ్య మేల్‘ అవార్డును అం దుకున్నారు.
వైశ్య సమాజంలో విశిష్ట ప్రతిష్ఠ కలిగిన ఈ అవార్డుల ప్రదాత్సోవాన్ని శ్రీ ఎమ్మాడి ప్రారంభించారు. డాక్టర్ నరేష్ న్యూరోసర్జరీ రంగంలో చేసిన విశేష సేవలు, రోగుల పట్ల ఆయన చూపిన మానవత్వం, కమ్యూనిటీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆయన కృషి ఈ అవార్డు అందుకోడానికి ప్రధాన కారణాలయ్యాయి. ఈ అవార్డులకు సుమధుర ఫౌండేషన్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. మణేపల్లి జ్యువెల్లర్స్, వాసవి కన్‌స్ట్రక్షన్, యెమ్మడి జ్యువెలర్స్ వ్యవస్థాపకులు వంటి ప్రముఖ వ్యాపారవేత్తల మద్దతుతో ఈ కార్యక్రమం ఘనతను సంతరించుకుంది.