calender_icon.png 27 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ కాలేజీలో పట్టభద్రుల దినోత్సవం

27-07-2025 12:24:11 AM

2000 మంది విద్యార్థులకు పట్టాలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజి నీరింగ్ కాలేజీలో 12వ పట్టభద్రుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, మెరిట్ అవార్డులు అందజేశారు.

ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్, రెస్పాన్సిబుల్ ఏఐ, ఫ్రెష్ వర్క్స్ శ్రీధర్ గాడే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి (వైస్ చైర్మన్), శ్రీశైలం రెడ్డి (కార్యదర్శి, కరస్పాండెంట్), డాక్టర్ ఎ శ్రీనివాసులరెడ్డి (ప్రిన్సిపాల్), అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో కలిసి ఆనందంగా పాల్గొన్నారు. వేడుకలు జాతీయ గీతంతో ముగిశాయి.