02-05-2025 07:51:07 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి జాదవ్ అంబాజీ నాయక్ ను శుక్రవారం గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో నిర్మల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో 98 శాతం ఫలితాలు రావడంతో డిడిని కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తుకారాం సీనియర్ ఉపాధ్యాయులు పల్స గజ్జరం తదితరులు ఉన్నారు.