02-05-2025 07:53:58 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో చారిత్రాత్మకమైన దేవాలయంగా గుర్తింపు పొందిన కోమటిపల్లి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ బల్లవరం కృష్ణమాచారి, పూజారి ఎస్ వి వి భట్టర్, సేవా సమితి అధ్యక్షులు షేరు శ్రీనివాస్, ఉమ్మగాని ప్రభాకర్, కొట్టం యాకమూర్తి తదితరుల ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు కనుల పండుగ నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కేసముద్రం, ఇనుగుర్తి మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, కూరెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.