calender_icon.png 27 January, 2026 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి

27-01-2026 12:00:00 AM

గణతంత్ర వేడుకలలో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్

ఉట్నూర్, జనవరి 26 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని  ఐటిడిఏ  పీవో యువరాజ్  మార్మాట్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు.  గణతంత్ర వేడుకల సందర్భంగా  ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో ఐటీడీఏ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా వైద్యంతో పాటు గిరిజనుల సంక్షేమాన్ని కోసం  కృషి చేస్తున్నామని వివరించారు.. ప్రజా ప్రభుత్వ పాలనలో  ప్రభుత్వం మంజూ రు చేసిన నిధులను గిరిజనులకు అందే విధంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ... గిరిజన ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధితో పాటు విద్యారంగంలో గిరిజన విద్యార్థులను  ముందుకు తీసుకు వెళ్లినందుకు  ప్రత్యేక కృషి చేస్తున్నామని  వివరించారు.