calender_icon.png 27 January, 2026 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

27-01-2026 12:00:00 AM

శ్రీరంగాపురం జనవరి 26: మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో సోమవారం నాడు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బాలరాజు(విజయ క్రాంతి), గౌరవ అధ్యక్షుడిగా రంగస్వామి నాయుడు, ఉపాధ్యక్షులుగా శివసాగర్, ప్రధాన కార్యదర్శిగా నారాయణ, కోశాధికారిగా నరేష్ గౌడ్, ప్రచార కార్యదర్శిగా శరత్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరీష్ గౌడ్, శ్రీనివాసులు, నరేష్ ,భాష , మదిలేటి లను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ శ్రీరంగాపురం మండలంలో విలేకరుల ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ప్రెస్ క్లబ్ నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రవీందర్ గౌడ్, వేణుగోపాల్, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.