calender_icon.png 12 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరున మాస్ పండుగే!

12-08-2025 01:10:47 AM

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న  ఈ చిత్రం నుంచి సోమవారం టీజర్ విడుదలైంది. మాస్ మహారాజా అభిమానులు ఆశించే అన్ని అంశాలు ‘మాస్ జాతర’ టీజర్ లో ఉన్నాయి. రవితేజ శైలి యాక్షన్, వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్ టైనర్‌ను చూడబోతున్నామనే హామీని టీజర్ ఇస్తోంది.

రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్‌తో కట్టిపడేశారు. శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసిపోయింది. రవితేజ, శ్రీలీల జోడి మరోసారి మాయ చేసేలా ఉంది. దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అసలైన పండుగ సినిమాలా ‘మాస్ జాతర’ను మలుస్తున్నట్టు తెలుస్తోంది.

టీజర్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అం టూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంది. భీమ్స్ సిసి రోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తోం ది. రవితేజ లుక్ అండ్ బిజియమ్ సినిమాపై అంచనాలను పెంచింది. వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండు గ ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.