calender_icon.png 6 May, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సీఎంని మీరు తిడితే.. మేమూ ప్రధానిని అంటాం: జగ్గారెడ్డి

06-05-2025 07:34:24 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు హద్దులు ఉండాలి రఘునందన్ రావు అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు తిడితే, అందుకు ప్రతికారంగా తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని అంటామని, గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ  బీజేపీ పార్టీ సంసారం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారా అని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దేశ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా.. ?, మోసగాళ్లకు మోసగాడు మోడీ అంటే.. మీరు ఫీల్ అవ్వరా..? అని జగ్గారెడ్డి, ఎంపీ రఘునందన్ రావును ప్రశ్నించారు.