06-05-2025 07:12:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతంగా నిర్వహించినందుకు వరంగల్ జిల్లా పార్టీ బృందానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కల్పించినందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సభను విజయవంతం చేయడంలో నిరంతరం శ్రమించిన నాయకులకు, ముఖ్యంగా గత నెల రోజులుగా 6 జిల్లాల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై కృషి చేసిన సందర్బంగా కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.