06-05-2025 07:55:47 PM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా ఓజీ కుష్ గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓజీ కుష్ గంజాయి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. 2024-25లో పలు కేసుల్లో 2010.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దానంతటిని కాల్చివేసినట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. మొత్తం 74 కేసుల్లో రూ.10,05,06,750 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.