calender_icon.png 27 July, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణమ్మ గలగల.. గోదావరి వెలవెల!

27-07-2025 12:19:40 AM

  1. జలకళతో కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లు
  2. మూడో వంతుకూడా నిండని గోదావరి బేసిన్ రిజర్వాయర్లు
  3. శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద
  4. నిండుకుండలా సాగర్ ప్రాజెక్టు 

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 26: రా ష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా రెండు విభిన్నమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదులలో వరద ప్ర వాహంలో భారీగా తేడాలు కనపడుతున్నా యి. దీనితో కృష్ణా నది పరివాహక ప్రాం తాల్లో నిర్మించిన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితులు కనపడగా.. గోదావరి పరివాహకంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అందుకు భిన్న మైన పరిస్థితి కనపడుతోంది.

ముఖ్యంగా కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తో న్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, సుం కేశుల ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రా జెక్టు జూరాల నిండటంతో సుమారు లక్ష క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన 24 గంటల్లో 1.40 లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటం.. ఇప్పటికే 202 టీఎంసీలు నిండటం (పూర్తిసామర్థ్యం 215.81 టీఎంసీలు)తో 1.56 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు 1.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే 90 శాతం (312 టీఎంసీల్లో 283.50 టీఎంసీలు) నిండటంతో మరో 28 టీఎంసీలకుపైగా అవకా శం ఉండటంతో కేవలం 15 వేల క్యూసెక్కుల వరద నీటినే దిగువకు విడుదల చేస్తున్నారు. 

నిండని ‘గోదావరి’ ప్రాజెక్టులు

గోదావరిలో ఈ సీజన్ పరిస్థితి భిన్నంగా కనపడుతోంది. ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టుకూడా పూర్తిగా నిండలేదు. కనీసం సగంకూడా నిం డిన ఆనవాళ్లు కనపడటం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడం మన రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా వచ్చి న వరద దిగువకు పోతుండటంతో ఉత్తర తెలంగాణలోని గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి వెలవెల పోతోంది. ఒక్క సిం గూరులో మాత్రమే ఫరవాలేదనే విధంగా పరిస్థితి ఉంది.

సింగూరు పూర్తి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. 19.50 టీఎంసీల నీరు ఉంది. కేవలం వేయి క్యూసెక్కులకుపైగా వరద మాత్రమే వస్తోంది. నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎండిపోతున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్తితి దయనీయంగా ఉంది. ఎగువన మహారాష్ట్ర నుంచి కేవలం 4500 క్యూసెక్కుల వరద నీరే వ స్తోంది.

మొత్తం 80.50 టీఎంసీల సామ ర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిం డింది కేవలం 21.88 టీఎంసీలు మాత్రమే. నిజాంసాగర్‌కూడా 20 శాతమే నిండింది. మహారాష్ట్రలోని గోదావరి పరివాహకంలో భారీగా వర్షాలు కురిసి.. అదేస్థాయిలో అక్కడి ప్రాజెక్టులన్నీ నిండి దిగువకు వరద నీటిని వదిలితేనే శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది.

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 10, 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నందు న రెండు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడు గులు కాగా 695 అడుగులను నిలువ సామర్థ్యాన్ని ఉంచి వచ్చేనట్టు గేట్ల ద్వారా బయట పంపుతున్నట్టు అధికారులు తెలిపారు.

ములుగు జిల్లాలో వానలు

ములుగు జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు సరస్సులు, చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి. లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. వాజేడు మండలంలో భారీగా వర్షంతో చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. సరస్సు సామర్థ్యం 33 అడుగులు కాగా ప్రస్తుతం 27 అడుగులకు చేరింది. మరో 6అడుగులు దాటితే సరస్సు మత్తడి పోస్తుంది. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ 80 మీటర్ల సామర్థ్యంతో బ్యారేజీ జలకళ సంతరించుకుంది. 

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం 

భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయం త్రం ఏడు గంటలకు 26 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం శనివారం సా యంత్రం 6 గంటలకు 35.40 అడుగులకు చేరుకొని ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇదే విధంగా పెరుగుతూ ఆదివారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకోవచ్చని అంచనాలతో అధికారులు అప్రమత్త మవుతున్నారు.

గోదావరి ఉపనది అయిన తాళిపేరు నది ప్రవహిస్తూ ఉండటం వల్ల శనివారం ఆరు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 24,358 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నది. భద్రాచలం వద్ద 36. 40 అడుగులకు చేరుకోవడంతో 9 లక్షల 32 వేల 288 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది. 36.40 అడుగులకు గోదావరి వరద చేరుకోవడంతో శనివారం సాయం త్రం భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు వరద మునిగిపోయాయి.

భారీ వర్షానికి తూరుబాక వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని కి వరద నీరు చేరుకోవటం తో శనివారం రాత్రి రెండు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపుతున్నారు. జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.60 అడుగులకు చేరుకుంది. కొత్తగా 3600 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపనున్నారు.