17 April, 2026 | 7:14 AM

జాగృతి కళాశాల విద్యార్థిని ప్రభంజనం....!!

15-06-2025 12:48 AM

విద్యార్థిని అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ అంబటి వినోద్ కుమార్..

వనపర్తి టౌన్: దశాబ్ద కాలంగా ఎంతగానో చదువుకు నిలయంగా ఉన్న వనపర్తి జిల్లాలో జాగృతి కళాశాలకు ఒక అరుదైన ఘనత సాధిస్తున్న తరుణంలో మరల నీట్ లో జాగృతి కళాశాల(Jagruti College) విద్యార్థిని మెరిసింది. ఇటీవల నిర్వహించిన  నీట్ పరీక్షలో 720 గాను వైష్ణవి (509) మార్కులు సాధించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ అంబటి వినోద్ కుమార్ అభినందించారు. అనంతరం కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని ఉన్నత చదువుల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తు కు ఎదగాలని ఆకాంక్షించారు.