05-04-2025 05:12:35 PM
భైంసా,(విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం వెంగ్వపేటలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి బాపూజీ చిత్రపటానికి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కరపత్రాలను పంపిణీ చేసి రాజ్యాంగ పీఠిక ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తిని, మహాత్మా గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ యాత్రను విజయవంతం చేద్దామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.